ICC T20 World Cup 2022 Venues లైన‌ప్‌లో 12 జ‌ట్లు, Super 12 కు నేరుగా...!! || Oneindia Telugu

2021-11-17 112

ICC Announces 7 Australian Host Cities For The T20 World Cup 2022, Melbourne To Host The Final
#T20WorldCup2022
#ICC
#T20WorldCup2022Venues
#AustralianHostCities
#IPL2022
#indvsnz

యూఏఈ, ఒమన్ వేదికగా రెండు రోజుల క్రితం టీ20 ప్రపంచకప్‌ 2021 ముగిసిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఇక మరో మెగా సమరం కూడా త్వరలోనే జరగనుంది. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్లకు ఒకసారి టీ20 ప్రపంచకప్‌ నిర్వహిస్తోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా టోర్నీలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో ఏడాదిలోనే ఇంకో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఆస్ట్రేలియా మెగా పోటీలకు ఆతిథ్యమిస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు ఖరారు చేశారు.